
Champions Trophy 2025: వన్డేల్లో 11 వేల రన్స్ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మరో గొప్ప ఘనతను అందుకున్నాడు. "హిట్‌మ్యాన్" గా ప్రసిద్ధి చెందిన రోహిత్, వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు పూర్తిచేసిన రెండవ అత్యంత వేగమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ విజయంతో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి, మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో తొలిస్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 11వ పరుగును పూర్తి చేసిన వెంటనే, రోహిత్ వన్డే క్రికెట్‌లో 11,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
వివరాలు
నాల్గవ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డు
భారత జట్టు తరఫున వన్డే క్రికెట్‌లో 11,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన నాల్గవ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ ఘనత రోహిత్‌కు ముందుగా భారత బ్యాట్స్‌మన్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ అందుకున్నారు . రోహిత్ శర్మ 261 ఇన్నింగ్స్‌లలో 11,000 పరుగుల మార్కును అధిగమించాడు. అతని కంటే ముందు, సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లలో, విరాట్ కోహ్లీ కేవలం 222 ఇన్నింగ్స్‌లలో 11,000 పరుగుల ఘనతను సాధించాడు. అంతేకాక, రికీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్‌లలో, సౌరవ్ గంగూలీ 288 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును అందుకున్నారు.
వివరాలు
అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 11,000 వన్డే పరుగులు చేసిన ఆటగాళ్లు
222 - విరాట్ కోహ్లీ 261 - రోహిత్ శర్మ 276 - సచిన్ టెండూల్కర్ 286 - రికీ పాంటింగ్ 288 - సౌరవ్ గంగూలీ