Rohit Sharma: సిడ్నీ టెస్టు నుండి రోహిత్ శర్మ ఔట్ .. టాస్ గెలిచి కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మెల్‌బోర్న్ వేదికగా చివరి టెస్టు ప్రారంభమైంది.
ఊహించినట్లుగానే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.
టాస్ సమయంలో భారత కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ విషయం వెల్లడించాడు.
రోహిత్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
టాస్ గెలిచిన బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు రెండు మార్పులు చేసింది, ఆస్ట్రేలియా కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది.
రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్ జట్టులో చేరి వన్‌డౌన్‌లో బ్యాటింగ్ ప్రారంభించాడు.
పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు, ఇది ఈ సిరీస్‌లో ప్రసిద్ధ్ కృష్ణ తొలి మ్యాచ్ కావడం గమనార్హం.
వివరాలు
మిచెల్ మార్ష్ స్థానంలో వెబ్‌స్టర్
స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని భావించిన సిడ్నీ పిచ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులో కొనసాగించారు.
మరోవైపు, ఆస్ట్రేలియా తన జట్టులో మిచెల్ మార్ష్ స్థానంలో వెబ్‌స్టర్‌ను చేర్చింది.
సిడ్నీ పిచ్ మొదట బ్యాటర్లకు సహకరిస్తుందని, అనంతరం స్పిన్నర్లకు అనుకూలమవుతుందని అంచనా.
ఈ కారణంగా భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.2000 తర్వాత ఈ మైదానంలో జరిగిన 27 టెస్టుల్లో 23 సార్లు జట్లు 400కి పైగా పరుగులు చేశాయి.
అయితే, చివరి రెండు రోజులు వర్షం ఆటకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది.
సిడ్నీ టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.
వివరాలు
లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయింది
శుభ్‌మన్ గిల్ (20) లంచ్‌కు ముందు చివరి బంతికి ఔటయ్యాడు. నాథన్ లైయన్ బౌలింగ్‌లో గిల్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు.
ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), యశస్వి జైస్వాల్ (10) విఫలమయ్యారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (12) నెమ్మదిగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ లేకపోయినా జట్టు ప్రదర్శనలో మార్పు కనిపించలేదు.
తుది జట్లు:
భారత్: యశస్వీ జైస్వాల్,శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీశ్ కుమార్‌రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్,జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: సామ్ కొన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా,లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ గ్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బొలాండ్.