తదుపరి వార్తా కథనం

Rohit Sharma: ముందుకెళ్లడం కష్టమే.. ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమిపై తొలిసారి స్పందించి రోహిత్ శర్మ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 13, 2023
04:09 pm
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ కప్ 2023లో టోర్నీలో వరుస విజయాలతో అద్భుతంగా రాణించిన భారత జట్టు, ఫైనల్ మ్యాచులో చేతులెత్తేసింది.
ఈ మ్యాచ్ ముగిసి 20 రోజులు దాటినా ఈ ఓటమిని యావత్ దేశం జీర్ణించుకోలేకపోయింది.
ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తొలిసారి స్పందించాడు.
ఓటమి నుంచి బయటికి ఎలా రావాలో అర్థం కావడం లేదని, తన కుటుంబం, స్నేహితులు తనకు ఓదార్పు చెప్పి బాధను తొలిగించే ప్రయత్నం చేశారన్నారు.
50 ఓవర్ల ప్రపంచ కప్ చూస్తూ పెరిగానని, దేశానికి వరల్డ్ కప్ అందించాలన్న తన చివరి కోరిక విఫలమైందని రోహిత్ ఎమోషనల్ అయ్యాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.