
Rohit Sharma: బంగ్లాపై బరిలోకి రోహిత్ శర్మ.. ఊరిస్తున్న భారీ రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్ ట్రోఫిలో భాగంగా భారత జట్టు గురువారం బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.
బలాబలాలు, గత రికార్డుల ఆధారంగా చూస్తే, ఈ మ్యాచ్‌లో భారత జట్టే మెరుగ్గా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పలు కీలక రికార్డులను సాధించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దుబాయ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఐదు ముఖ్యమైన రికార్డులు సాధించేందుకు అవకాశం ఉంది.
Details
రోహిత్ శర్మను ఊరిస్తున్న కీలక రికార్డులివే
1. 11,000 వన్డే పరుగుల మైలురాయి
మరో 12 పరుగులు సాధిస్తే, రోహిత్ వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు.
ఇప్పటికే విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్) ఈ ఘనత సాధించాడు. రోహిత్ ఇప్పటివరకు 260 ఇన్నింగ్స్‌ల్లో 10,988 పరుగులు చేశాడు.
అత్యంత వేగంగా 11,000 వన్డే పరుగులు చేసిన ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ (భారత్) - 222 ఇన్నింగ్స్‌లు
సచిన్ టెందూల్కర్ (భారత్) - 276 ఇన్నింగ్స్‌లు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 286 ఇన్నింగ్స్‌లు
సౌరభ్ గంగూలీ (భారత్) - 288 ఇన్నింగ్స్‌లు
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) - 293 ఇన్నింగ్స్‌లు
Details
2. భారత క్రికెట్‌లో నాలుగో వ్యక్తిగా రికార్డు
రోహిత్ శర్మ 11 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటే, భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా నిలుస్తాడు.
ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (18,426), విరాట్ కోహ్లీ (13,963), సౌరభ్ గంగూలీ (11,363) మాత్రమే ఈ రికార్డు సాధించారు.
3. బంగ్లాదేశ్‌పై వరుసగా నాలుగో సెంచరీ
2015 వన్డే వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్లో 137 పరుగులు
2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో 123 పరుగులు
2019 వన్డే వరల్డ్ కప్ లీగ్ దశలో సెంచరీ
ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే, బంగ్లాదేశ్‌పై వరుసగా నాలుగు మెగాటోర్నమెంట్లలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు.
Details
4. 50 అంతర్జాతీయ సెంచరీలు
ఈ మ్యాచ్‌లో శతకం సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన 10వ బ్యాటర్‌గా రోహిత్ మరో ఘనత అందుకుంటాడు.
భారత తరఫున ఈ రికార్డు సాధించే మూడో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం సచిన్ (100 సెంచరీలు), విరాట్ కోహ్లీ (81 సెంచరీలు) ఈ జాబితాలో ఉన్నారు.
5. 100 అంతర్జాతీయ విజయాలు సాధించిన నాలుగో కెప్టెన్
భారత్ తరఫున 100 అంతర్జాతీయ మ్యాచ్‌లలో గెలిచిన నాలుగో కెప్టెన్‌గా రోహిత్ నిలుస్తాడు. ఇప్పటివరకు అజహరుద్దీన్, ధోనీ, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ రికార్డు సాధించారు.
ప్రస్తుతం రోహిత్ నాయకత్వంలో టీమ్ ఇండియా 137 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, 99 విజయాలు సాధించింది.
Details
6. అత్యధిక వన్డే సిక్సర్ల రికార్డు
ఈ మ్యాచ్‌లో 14 సిక్స్‌లు బాదితే, వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ అగ్రస్థానంలో నిలుస్తాడు. -
ప్రస్తుతం షాహిద్ అఫ్రిదీ (351 సిక్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ 338 సిక్స్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ రికార్డులను సాధించే అవకాశం ఉండటంతో, రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అభిమానులకు మెమోరబుల్ ఇన్నింగ్స్ అందించే అవకాశం ఉంది.