Page Loader
Rohit Sharma: వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. క్రిస్‌గేల్ అల్‌టైమ్ రికార్డు బద్దలు 
వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. క్రిస్‌గేల్ అల్‌టైమ్ రికార్డు బద్దలు

Rohit Sharma: వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. క్రిస్‌గేల్ అల్‌టైమ్ రికార్డు బద్దలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2023
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మంచి ఆరంభాన్ని అందించారు. రోహిత్ శర్మ మరోసారి సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు. 29 బంతుల్లో 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 47 పరుగులు చేసి హిట్ మ్యాన్ ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ హఫ్ సెంచరీ మిస్ అయినప్పటికీ, ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.

Details

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

రోహిత్ శర్మ 50 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (49), ఏబీ డీవిలియర్స్ (37), రిక్కీ పాంటింగ్ (31), బ్రెండన్ మెక్ కల్లమ్ (29) ఉన్నారు. ఈ ఎడిషన్ లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 27కు చేరుకుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా హిట్ మ్యాన్ రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లు 27 - రోహిత్ శర్మ (2023) 26 - క్రిస్ గేల్ (2015) 22 - ఇయాన్ మోర్గాన్ (2019) 22 - గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (2023)