
IND vs ENG: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో భారత్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు ఇంగ్లండ్ తలొగ్గింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కటక్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.
4 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 305 పరుగుల భారీ లక్ష్యాన్ని 44.3 ఓవర్లలోనే చేధించింది.
గిల్ (60) అర్ధశతకంతో ఆకట్టుకోగా, అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41*) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
Details
ఈనెల 12న మూడో వన్డే
కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు సెంచరీ (90 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్సర్లు)తో జట్టును ముందుండి నడిపించాడు.
ఈ విజయంతో భారత జట్టు ఇంగ్లండ్‌పై వరుసగా టీ20, వన్డే సిరీస్‌లను గెలుచుకుంది.
అంతేకాకుండా, కటక్‌లోని బారబతి స్టేడియంలో ఉన్న అజేయ రికార్డును కొనసాగించింది. గత 23 ఏళ్లుగా ఈ వేదికపై భారత్ ఓటమిని చవిచూడలేదు.
అలాగే ఈ మ్యాచ్‌లో రోహిత్ ఫామ్‌లోకి రావడం జట్టుకు మంచి సూచనగా మారింది.
ఇంగ్లండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇక సిరీస్‌లో చివరి వన్డే ఈనెల 12న అహ్మదాబాద్‌లో జరగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్
2ND ODI. India Won by 4 Wicket(s) https://t.co/NReW1eEQtF #INDvENG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 9, 2025