Rohit Sharma: టాస్‌లో రోహిత్ అన్‌లక్కీ.. లారా రికార్డును సమం చేసిన హిట్ మ్యాన్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. నేడు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్‌లో మరోసారి ఓటమి పాలయ్యాడు.
వన్డే క్రికెట్‌లో వరుసగా 12వ సారి టాస్‌ను కోల్పోయాడు. దీంతో వెస్టిండీస్ లెజెండ్ బ్రయన్ లారా 1998-99 సీజన్‌లో వరుసగా 12 టాస్‌లు కోల్పోయిన రికార్డును రోహిత్ సమం చేశాడు.
ఈ ఫార్మాట్‌లో భారత్‌ను అదృష్టం వెక్కరించడం ఇది వరుసగా 15వ సారి. 2023 వన్డే వరల్డ్ కప్‌లో అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా పోరుతో ఈ పరంపర మొదలైంది.
అప్పటి నుంచి వరుసగా భారత్ టాస్ ఓడిపోవడం కొనసాగుతోంది.
Details
మూడో స్థానంలో పీటర్ బారెన్
ఈ జాబితాలో లారా, రోహిత్ తొలిస్థానంలో సంయుక్తంగా ఉండగా, నెదర్లాండ్స్‌కు చెందిన పీటర్ బారెన్ 11 సార్లు టాస్ ఓడిపోయి మూడో స్థానంలో ఉన్నాడు.
ఇదిలా ఉండగా, భారత్‌కు పిచ్ అడ్వాంటేజ్ ఉందని ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల ఆటగాళ్లు వరుసగా ఆరోపణలు చేస్తున్నారు.
కానీ వాస్తవానికి రోహిత్ వరుసగా టాస్ ఓడిపోవడం వల్ల పిచ్ పరిస్థితులను తెలిసినా, తనకు నచ్చినట్లుగా బ్యాటింగ్, బౌలింగ్ ఎంచుకునే అవకాశం భారత్‌కు లేకుండాపోయింది.
ప్రత్యర్థి జట్టు నిర్ణయాన్ని స్వీకరించడం తప్ప మరో మార్గం లేదు. దీంతో భారత్‌కు పిచ్ అడ్వాంటేజ్ చాలా వరకు కోల్పోయినట్లయింది.