Page Loader
IND Vs BAN : టాస్ గెలిచిన రోహిత్.. ఐదురుగు కీలక ప్లేయర్లకు రెస్ట్
టాస్ గెలిచిన రోహిత్.. ఐదురుగు కీలక ప్లేయర్లకు రెస్ట్

IND Vs BAN : టాస్ గెలిచిన రోహిత్.. ఐదురుగు కీలక ప్లేయర్లకు రెస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2023
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ సూపర్ 4లో చివరి మ్యాచులో నేడు భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక రోహిత్ శర్మ జట్టులో ఐదు మార్పులు చేశాడు. తిలక్ వర్మ, శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ కృష్ణ, సూర్య కుమార్ యాదవ్, మహ్మద్ షమీ జట్టులోకి వచ్చారు. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ కు విశ్రాంతినిచ్చాడు. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 39 వన్డేలు మ్యాచులు జరగ్గా, ఇందులో భారత్ 31 మ్యాచులు, బంగ్లాదేశ్ 7 మ్యాచులు గెలిచాయి. ఓకే మ్యాచ్ ఫలితం తేలలేదు.

Details

బంగ్లాదేశ్, టీమిండియా తుది జట్లు ఇవే!

టీమిండియా జట్టు రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్‌ కృష్ణ. బంగ్లాదేశ్‌ జట్టు లిటన్ దాస్(వికెట్ కీపర్), తాంజిద్ హసన్, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షమీమ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మెహది హసన్, నసూమ్ అహ్మద్, తన్జిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.