LOADING...
RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
11:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల దీర్ఘ నిరీక్షణకు చెక్‌ పెట్టి తొలి టైటిల్‌ను సాధించి కలను నిజం చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.

Details

అద్భుతంగా పోరాడిన శశాంక్ సింగ్

పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్ అద్భుతంగా పోరాడాడు. అతను 30 బంతుల్లో అజేయంగా 61 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసినా, జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇతర బ్యాటర్లు జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు (23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 26, ప్రియాంశ్ ఆర్య 24, నేహల్ వధేరా 15 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్య తలో రెండు వికెట్లు తీసారు. హేజిల్‌వుడ్, రొమారియో షెఫర్డ్, యశ్ దయాల్ ఒక్కొక్క వికెట్ అందుకున్నారు. ఈ విజయంతో ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్డాది, అభిమానుల ఆశల్ని నెరవేర్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ