Sanjay Majrekar: కోహ్లీపై మాజీ క్రికెటర్.. 2024 ప్రపంచకప్'పై సంజయ్ మంజ్రేకర్ ఏమన్నారంటే
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో రానున్న టీ20 ప్రపంచకప్' టీమిండియా గెలవాలంటే కొన్ని సలహాలు సూచనలు చేశారు. ఇదే సమయంలో 2022 టీ-20 ప్రపంచకప్ తర్వాత భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత్ తరఫున టీ20 మ్యాచులు ఆడలేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ 2024 ఎంపికపై, సంజయ్ మంజ్రేకర్ ఖచ్చితమైన పరిష్కారం చెప్పారు. అయితే భారత టీ20 ప్రపంచకప్ జట్టు కోసం, అతి చిన్న ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన, ప్రాముఖ్యతను భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి నొక్కిచెప్పాడు.
మంచి బృందాన్ని ఎంచుకోవాలని సూచన
ప్రస్తుత టీ20 బ్యాటర్, ఆల్ రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కోహ్లి వర్ధమాన ప్రతిభ కంటే తానే గొప్ప అని నిరూపించుకోవాలని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ODI ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఓటమి పాలైన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కోహ్లీ విరామ నేపథ్యంలో మంజ్రేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు టీ20 మ్యాచుల్లో విరాట్ టోర్నమెంట్‌లోనే అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడని చెప్పారు. మరోవైపు జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు,రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. విధానం చాలా సరళంగా ఉండాలని నేను నమ్ముతున్నానన్నారు. తాము చాలా ప్రపంచకప్‌లు ఆడామని,అయినా వాటిని గెలవలేకపోయామన్నారు.మీ చేతుల్లోకి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని సునాయసం చేయండి, ఫామ్ ఆధారంగా జట్టును ఎంచుకోండన్నారు.