LOADING...
Sanju samson: శాంసన్‌ దయాగుణం… సెల్ఫీ కోరిన అభిమానికి అదిరిపోయే గిఫ్ట్
శాంసన్‌ దయాగుణం… సెల్ఫీ కోరిన అభిమానికి అదిరిపోయే గిఫ్ట్

Sanju samson: శాంసన్‌ దయాగుణం… సెల్ఫీ కోరిన అభిమానికి అదిరిపోయే గిఫ్ట్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 09, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ప్రముఖ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తన ఉదార స్వభావాన్ని మరోసారి నిరూపించాడు. తన అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేక బహుమతిని అందించాడు. ఐపీఎల్‌-2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సంజూ ఆడుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న జరిగిన చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే, ఆర్సీబీతో పోటీ పడింది. తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల విరామం లభించడంతో సంజూ తిరువనంతపురంకు వెళ్లాడు. ఈ సమయంలో మంగళవారం ముండూరు-తూత రోడ్డులో ఫోన్‌లో మాట్లాడేందుకు తన కారును రోడ్డుపక్కన ఆపాడు. అదే సమయంలో కేబుల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శబరీష్, తన స్నేహితుడు మణికంఠన్‌తో కలిసి బైక్‌పై క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాడు. కారులో సంజూ ఉన్నట్లు గమనించిన శబరీష్ వెంటనే తన బైక్‌ను ఆపాడు.

వివరాలు

ఊహించని బహుమతి..

ఫోన్ కాల్ ముగించిన అనంతరం సంజూ శబరీష్‌తో ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. ఫోటో తీసుకుందామా అని సంజూనే ముందుగా అడగడం ప్రత్యేకం. దీంతో శబరీష్ తన మొబైల్ తీసుకుని సెల్ఫీ తీసుకున్నాడు. అయితే అతని ఫోన్ స్క్రీన్ పూర్తిగా పగిలిపోయి ఉండటం సంజూ గమనించాడు. అదే క్షణంలో స్పందించిన సంజూ, తన వద్ద ఉన్న సుమారు రూ.40,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను శబరీష్‌కు కానుకగా ఇచ్చాడు. ఈ అనూహ్య బహుమతితో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉండగా, టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంజూ శాంసన్, ఈ ఐపీఎల్ సీజన్‌లో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు.

Advertisement