7 నెలల తర్వాత టీమిండియా జట్టులోకి సంజు శాంసన్.. ఈసారైనా!
టాలెంటెడ్ ప్లేయర్ సంజు శాంసన్ కు టీమిండియాలో చోటు దక్కడంపై టీమిండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా శాంసన్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు అశిస్తున్నారు. వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ సంజుకీ అశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. శాంసన్ 2015లో జింబాబ్వేతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నిలకడలేమీ ప్రదర్శనతో అతను జట్టులో అవకాశాలను కోల్పోయాడు. అదే సమయంలో యువ ఆటగాళ్లు రాణిస్తుండటంతో అతను సుదీర్షకాలం వేచి ఉండాల్సిన పరిస్థతి నెలకొంది. దాదాపు 7 నెలల అనంతరం మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అతను విఫలమయ్యాడు.
సంజుశాంసన్‌పై భారీ ఆశలు
ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా జట్టును ముందుడి నడిపించిన సంజు శాంసన్ 14 మ్యాచులలో 362 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తొలసారిగా అతనికి అవకాశం దక్కింది. గ్రేడ్ 'సీ' ఆటగాళ్ల జాబితాలో అతను చేరాడు. ఇప్పటివరకూ 11 వన్డేలు ఆడిన శాంసన్ 330 పరుగులు చేశాడు. ఇక 17 టీ20 మ్యాచులలో 301 పరుగులు సాధించాడు. విండీస్ తో జరిగే సిరీస్ లో శాంసన్ అద్భుతంగా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే విండీస్ తో వన్డే సిరీస్ తుది జట్టులో అతని పేరు ఉంటుందో లేదో వేచి చూడాలి.