Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ కి సంజూ శాంసన్ గుడ్ బై?
2008 ఐపీఎల్ సీజన్‌లో, షేన్‌వార్న్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తరువాత, వారు మళ్లీ కప్‌ను సాధించలేకపోయారు. కెప్టెన్లు, ఆటగాళ్లను మార్చడం, అనేక ప్రాయోగిక మార్పులు చేసినా, కప్‌ను తిరిగి సాధించలేకపోయారు. ప్రస్తుతం, ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సీజన్ కంటే ముందుగా జరగనున్న మెగా వేలంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.దీంతో సంజూ శాంసన్ జట్టుకు గుడ్ బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రాజస్థాన్ రాయల్స్ సోషియల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
2021 నుండి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్
సంజూ శాంసన్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ, "మేజర్ మిస్సింగ్" అనే క్యాప్షన్ ఇచ్చారు.అదే సమయంలో ఏడుస్తున్న ఎమోజీని కూడా జత చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో, రాజస్థాన్ రాయల్స్‌ను సంజూ శాంసన్ వీడటం ఖాయమనే అనుమానం వ్యక్తమవుతోంది. 2018 నుంచి సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు. 2021 నుండి జట్టుకు కెప్టెన్‌గా ఉంటున్నాడు. అతని నేతృత్వంలో ఆ జట్టు ఒకసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ కెరీర్‌లో 167 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, 4419 పరుగులు చేసి, 3 శతకాలను సాధించాడు. అతను మెగా వేలానికి వస్తే, అతనిని కొనుగోలు చేయాలని ప్రాంఛైజీలు పోటీ పడతాయనడంలో సందేహం లేదు.