Page Loader
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి
క్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి

Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2024
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ కేటగిరిలో భారత్ చేదు అనుభవం ఎదురైంది. స్వాతిక్-చిరాగ్ జోడి ఒలింపిక్స్ 2024 లో సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. మలేషియా జోడీ సోహ్ వుయ్ యిక్, ఆరోన్ చియా చేతిలో వారు 2-1 తేడాతో ఓటమిపాలయ్యారు. తొలి గేమ్‌లో భారత జట్టు 21-13తో గెలుపొందినా, రెండో గేమ్‌లో 14-21 తేడాతో ఓడిపోయారు. హోరాహోరీగా జరిగిన మూడో రౌండ్లో స్వాత్విక్, చిరాగ్ పుంజుకున్న ఆ తర్వాత నిరాశపరిచారు. దీంతో 16-21 తేడాతో మూడో రౌండ్ లో ఓడి సెమీ ఆశలు చేజార్చుకున్నారు.

Details

తొలి మ్యాచులో విజయం సాధించిన స్వాతిక్-చిరాగ్ జోడి

భారత జోడీ దూకుడుగా ఆడుతూ తొలి గేమ్‌ ముగిసే వరకు భారత జట్టు 11-10తో ఆధిక్యంలో ఉంది. ఇక రెండో గేమ్‌లో, మలేషియా జోడీ అద్భుతంగా పుంజుకొని రాణించింది. పారిస్ ఒలింపిక్స్‌లో తమ తొలి మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-17, 21-14తో స్ట్రెయిట్ గేమ్‌లలో ఫ్రాన్స్‌కు చెందిన రోనన్ లేబర్, లుకాస్ కొర్వీ జోడీని ఓడించింది. తొలి గేమ్‌ను 23 నిమిషాలు, రెండో గేమ్‌ను 22 నిమిషాల్లో గెలిచారు.

Details

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత జోడీ 

ఈ ఇద్దరు ఆసియా క్రీడల 2023 పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల్లో భారత జోడీ స్వర్ణ పతకం సాధించడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియాకు చెందిన చోయ్ సోల్గు, కిమ్ వోన్హో జోడీని 21-18, 21-16తో వరుస సెట్లలో ఓడించి ఈ ఘనత సాధించింది.