IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు పుణె వేదికగా జరగబోయే రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకోవాలని కృతనిశ్చయంగా ఉంది.
రెండో టెస్టు అక్టోబర్ 24న ప్రారంభమవ్వనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్‌పై భారత్ జట్టు తక్కువ అంచనా వేసింది.
రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలని భారత్ భావిస్తోంది.
Details
ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం
భారత జట్టు ఈ ఏడాది ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది.
ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బెంగళూరు పిచ్‌ను పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా మార్చటానికి కృషి చేశారు.
కానీ తొలి టెస్టులో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు విజయం సాధించడంతో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌటయ్యింది.
ప్రస్తుతం టీమ్ మేనేజ్‌మెంట్ పుణె టెస్టులో ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే వారు స్పిన్ పిచ్‌ను సహజంగా ఉంచాలని క్యూరేటర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
టీమ్‌లో ఉన్న రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు సమస్యల్ని తేవడం ఖాయంగా ఉంది.
Details
వ్యూహాలకు పదును పెడుతున్న భారత్
పుణె పిచ్ మొదటి రెండు రోజుల్లో ఫాస్ట్ బౌలర్లకు సహకారం అందిస్తుంది. కానీ మూడో రోజున స్పిన్నర్లు తమ పని చేయడం ప్రారంభిస్తారు.
ఐదో రోజున, బ్యాటర్లు బంతి గమనాన్ని అంచనా వేయడం చాలా కష్టమవుతుంది.
తొలి టెస్టులో ఓటమి తర్వాత, న్యూజిలాండ్ జట్టు భారత స్పిన్ పిచ్‌తో సవాళ్లు ఎదుర్కొంటుందని అంచనా వేస్తోంది.
సీనియర్ ప్లేయర్ డార్లీ మిచెల్ ప్రకారం, వారు పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.