IND VS WI: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. హాఫ్ సెంచరీలతో రాణించిన భారత బ్యాటర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ట్రినిడాడ్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో భారీ స్కోరు దిశగా భారత్ బ్యాటింగ్ సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ మరోసారి అద్భుతంగా రాణించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 139 పరుగులు జోడించారు. జైస్వాల్ 57, రోహిత్ శర్మ 80 పరుగులతో ఫర్వాలేదనిపించారు.
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన శుభ్‌మాన్ గిల్ 10, అంజిక్యా రహానే 8 పరుగులతో నిరాశపరిచారు.
ఆరంభంలో 139-0 పటిష్టంగా ఉన్న టీమిండియా జట్టు 43 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది.
Details
సెంచరీకి చేరువలో విరాట్ కోహ్లీ
ప్రస్తుతం క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు.
విరాట్ కోహ్లీ 87, రవీంద్ర జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్ కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇక 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచులో సెంచరీ చేస్తాడని అభిమానులు అశిస్తున్నారు.
వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, గాబ్రియెల్, కెమర్ రోచ్, వారికన్ తలో వికెట్ తీశారు.