Page Loader
ENG vs IND: జులై 2 నుంచి రెండో టెస్టు.. బుమ్రా ఎంపికపై క్లారిటీ ఎప్పుడంటే?
జులై 2 నుంచి రెండో టెస్టు.. బుమ్రా ఎంపికపై క్లారిటీ ఎప్పుడంటే?

ENG vs IND: జులై 2 నుంచి రెండో టెస్టు.. బుమ్రా ఎంపికపై క్లారిటీ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా పాల్గొనబోయే మ్యాచ్‌ల సంఖ్యపై ఇప్పటికే భారత జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్‌ సమస్యల నేపథ్యంలో బుమ్రా మూడే టెస్టుల్లో పాల్గొనాలని ముందుగానే నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్. మొదటి టెస్టులో బుమ్రా తనదైన పేస్‌తో రాణిస్తూ ఐదు వికెట్లు తీయగా, భారత్‌ మాత్రం ఆ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. దీంతో సిరీస్‌లో 0-1తో వెనుకబడింది.

Details

ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు బుమ్రా ఆడతాడా? 

జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో బుమ్రా ఆడతాడా అన్న అనుమానాలపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌ డస్కాటే స్పందించాడు. బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉన్నాడు. మొదటి మ్యాచ్ తర్వాత అతడు వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అతడి ఫిట్‌నెస్‌, వాతావరణ పరిస్థితులు, పిచ్ స్వభావం వంటి అంశాలపై బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని డస్కాటే తెలిపారు. బుమ్రాపై మాత్రమే కాదు, ఇతర ఆటగాళ్ల పనిభారంపైన కూడా మేనేజ్‌మెంట్ దృష్టిసారించిందని డస్కాటే పేర్కొన్నారు. సుదీర్ఘ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని రొటేషన్ విధానాన్ని పాటించాలనే యోచనలో ఉన్నామని తెలిపారు.

Details

టెక్నికల్‌గా అందుబాటులో ఉన్న బుమ్రా 

టెక్నికల్‌గా బుమ్రా రెండో టెస్టు సెలెక్షన్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, చివరి నిమిషంలోనే అతని పాల్గొనడం-పాలకపోవడం పై తుది నిర్ణయం తీసుకుంటామని డస్కాటే పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, పిచ్ స్వభావం వంటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. భారత బౌలింగ్‌ లైనప్‌కు ప్రధాన బలం అయిన బుమ్రా రెండో టెస్టులో బరిలోకి దిగితేనే భారత్‌ పేస్ దాడి మరింత బలపడనుంది. కానీ అతడి వాడకంపై జాగ్రత్తగా వ్యవహరించాలన్న టీమ్‌ స్ట్రాటజీ నేపథ్యంలో అభిమానులు మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.