ICC Champions Trophy 2025: ఐసీసీ టోర్నీలో భద్రతా సమస్య.. వంది మంది పోలీసులపై వేటు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది.
ఇప్పుడు మరో అంశం వెలుగులోకొచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భద్రతా విధులు నిర్వహించాల్సిన పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు విధులకు హాజరుకాకపోవడంతో అక్కడి ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంది.
తొలగించిన వారు పోలీసు విభాగంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నట్లు సమాచారం.
గతంలో కూడా అనేక సందర్భాల్లో విధులకు గైర్హాజరైనట్లు గుర్తించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Details
విధుల కోసం భారీగా పోలీసులు మోహరింపు
లాహోర్‌లోని గదాఫీ స్టేడియం నుంచి జట్లు బస చేసే హోటళ్ల వరకు కఠిన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, అంతర్జాతీయ టోర్నీల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం సహించమని పంజాబ్ ప్రావిన్స్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ స్పష్టం చెప్పారు.
ఆటగాళ్ల రక్షణకు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించామని, అయితే కొంతమంది విధులకు హాజరుకాలేదన్నారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించమని తెలియజేశారు.
Details
గంటల తరబడి విధులు - ఇదే కారణమా?
పెద్ద సంఖ్యలో పోలీసులు విధులకు హాజరుకాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి గల కారణాలపై స్థానిక మీడియా కథనాల ప్రకారం కొన్ని వివరాలు బయటకొచ్చాయి.
ముఖ్యంగా పోలీసులపై విధించిన సుదీర్ఘమైన పని గంటల ఒత్తిడి దీనికి కారణమని భావిస్తున్నారు.
రోజులు తరబడి విధుల్లో ఉండేలా షిఫ్టులు ఏర్పాటు చేయడంతో వారు ఆత్మస్థైర్యం కోల్పోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ చేరకపోవడం కూడా పోలీసులపై ప్రభావం చూపించి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.