బట్లర్‌కు గాయం.. అందుకే అశ్విన్ ఓపెనర్ గా వచ్చాడు : సంజు శాంసన్
2023లో భాగంగా గువాహటి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 192 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సంజు శాంసన్ ఓటమికి గల కారణాలను వివరించాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ పై తమ బౌలర్లు వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులకు కట్టడి చేసేందుకు ప్రయత్నించారని, అయితే పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేని అద్భుతంగా వినియోగించుకుందని, బ్యాటింగ్ అనుకూలించే పిచ్‌పై పంజాబ్ ను 197 పరుగులకే తమ బౌలర్లు కట్టడి చేయడం అభినందనీయమని సంజుశాంసన్ చెప్పారు.
ధ్రువ్ జురెల్ అద్భుతంగా రాణించాడు
తమ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వేలికి గాయమైందని, దీంతో అతడు ఫిట్ గా లేకపోవడం వల్ల అశ్విన్ ని ఓపెనర్ గా పంపి, మిడిలార్డర్ లో ఫడిక్కల్ ను ఆడించామని సంజు శాంసన్ వెల్లడించారు. ఇక ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ అధ్భుతంగా రాణించాడని, ఐపీఎల్ ఆరంభానికి ధ్రువ్ ప్రాక్టీసులో దాదాపు వెయ్యి బంతులు ఆడానని, తాను బ్యాటింగ్ లో రాణించడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయామని, తదుపరి మ్యాచ్ లో ఓటమి నుంచి పాఠాలు నేర్చకుంటామని వివరించారు.