Loading...
Shubman Gill: శ్రీలంక సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు షాక్.. ప్రాక్టీస్‌లో గాయపడిన కెప్టెన్ గిల్!
శ్రీలంక సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు షాక్.. ప్రాక్టీస్‌లో గాయపడిన కెప్టెన్ గిల్!

Shubman Gill: శ్రీలంక సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు షాక్.. ప్రాక్టీస్‌లో గాయపడిన కెప్టెన్ గిల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఆందోళన కలిగించే వార్త ఎదురైంది. జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గురువారం నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో పేసర్ గుర్నూర్ బ్రార్ వేసిన బంతి గిల్ కుడి చేతి బొటనవేలికి బలంగా తాకింది. బంతి తగలడంతో వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి అతడికి చికిత్స అందించారు. అనంతరం గిల్ బొటనవేలికి స్ట్రాప్ కట్టించుకుని మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. అయితే ఆ తర్వాత అతడు వేగ బౌలర్లను ఎదుర్కోకుండా కేవలం స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రమే సాధన కొనసాగించాడు.

వివరాలు

జట్టు నుంచి అధికారిక సమాచారం వెలువడలేదు

దీంతో గాయం తీవ్రతపై కొంత ఆందోళన నెలకొంది.

ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ గాయం ఎంత తీవ్రంగా ఉందనే విషయంపై భారత జట్టు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

అతడు శుక్రవారం శ్రీలంక ఎలెవన్‌తో ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడతాడా? అలాగే ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడా? అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

ADVERTISEMENT