Page Loader
IND Vs AFG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన షాహిది, ఒమర్ జాయ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

IND Vs AFG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన షాహిది, ఒమర్ జాయ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2023
06:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా, ఆఫ్గాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఆఫ్గాన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆ జట్టులో హజ్మతుల్లా షాహిది(80), అజ్మతుల్లా ఒమర్ జాయ్ (62)లు అర్ధసెంచరీలతో చెలరేగి, ఆఫ్గాన్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. ఇక జద్రాన్ 22, గుర్బాజ్ 21, నబీ 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా నాలుగు వికెట్లతో విజృంభించగా, హార్ధిక్ పాండ్యా రెండు, కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post