
Shashank: శ్రేయస్ సెంచరీ మిస్ అవ్వడంపై శశాంక్ స్పందన ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన శతకాన్ని చేజార్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్, ప్రారంభం నుంచే మెరుపు ఆటతీరు కనబరిచాడు.
ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డ అతడు, 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 90 పరుగుల వద్ద నిలిచాడు.
ఇంకా మూడు ఓవర్లు మిగిలుండటంతో శ్రేయస్ సెంచరీ సాధించడం ఖాయమని అందరూ భావించారు.
అయితే,చివరి రెండు ఓవర్లలో కేవలం మూడే బంతులు ఆడి,7 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ముఖ్యంగా,శశాంక్ సింగ్ ఎక్కువగా స్ట్రైక్‌ను తీసుకోవడంతో,శ్రేయస్ 97 పరుగుల వద్దే ఆగిపోయాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది.
వివరాలు
శశాంక్ సింగ్ వివరణ
మ్యాచ్ అనంతరం శశాంక్ సింగ్ స్పందిస్తూ, శ్రేయస్ సూచన మేరకే ఎక్కువ స్ట్రైక్‌ను తీసుకున్నానని వివరించాడు.
"శ్రేయస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నేను క్రీజులోకి వచ్చిన వెంటనే అతను ఒకటే చెప్పాడు - 'సెంచరీ గురించి ఆలోచించకు, జట్టు స్కోర్‌ను పెంచడంపై దృష్టిపెట్టండి' అని. అతని మాటలు నాకు స్పూర్తినిచ్చాయి. నాకు బౌండరీలు బాదగల సామర్థ్యం ఉందని నమ్మకం ఉంది. ఈ స్థితిలో ఎవరు బ్యాటింగ్ చేసినా దూకుడుగా ఆడాల్సిందే. నాకు నా బలం తెలుసు, అందుకే నాపై పూర్తి దృష్టి పెట్టాను. జట్టును స్వేచ్ఛగా ఆడేలా ఉంచిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు" అని శశాంక్ చెప్పాడు.
వివరాలు
శశాంక్ మెరుపులతో పంజాబ్ భారీ స్కోర్
ఈ మ్యాచ్‌లో శశాంక్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదుతూ 44 పరుగులు చేశాడు.
చివరి ఓవర్‌లో శ్రేయస్ ఒక్క బంతీ కూడా ఆడే అవకాశం లేకుండా, వరుసగా 5 ఫోర్లు కొట్టి 23 పరుగులు సాధించాడు.
ఆఖరి ఓవరుకు ముందు 97 పరుగులు చేసిన శ్రేయస్, మూడంకెల స్కోర్‌ను అందుకోలేకపోయాడు.
అయినప్పటికీ, శశాంక్ మెరుపులతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది.