Shikhar Dhawan: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచారకర్తగా శిఖర్ ధావన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు.
ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి నలుగురు అంబాసిడర్లను ఎంపిక చేసింది.
ఈ జాబితాలో ధావన్‌తో పాటు, 2017లో పాకిస్తాన్‌కు చాంపియన్స్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ టిమ్ సౌతీ చోటు దక్కించుకున్నారు.
2013లో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకునేందుకు కీలక పాత్ర పోషించిన ధావన్, ఈ టోర్నీ చరిత్రలో వరుసగా రెండుసార్లు 'గోల్డెన్ బ్యాట్' అవార్డు గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
Details
ఆనందంగా ఉంది : ధావన్
ఈ ప్రాతినిధ్యం తనకు ఎంతో గౌరవంగా ఉందని ధావన్ పేర్కొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్‌గా ఎంపిక కావడం ఆనందంగా ఉందని, ప్రపంచంలోని అత్యుత్తమ 8 జట్లు పోటీపడే ఈ టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 701 పరుగులు చేసిన ధావన్, భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
2013 చాంపియన్స్ ట్రోఫీలో 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డును గెలుచుకున్న అతను, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు.