జస్ప్రిత్ బుమ్రాపై షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐదు నెలలకు పైగా క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. వెన్నెముక గాయం పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్ 2023 నుంచి వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణించి ప్రస్తుతం టీమిండియాకు దూరమయ్యాడు. గతేడాది ఆగస్టు నుంచి టీమిండియాకు దూరమైన బుమ్రా.. ఈ మధ్య సర్జరీ చేసుకోవడంతో మరో ఆరు నెలలు క్రికెట్ కు దూరం కానున్నాడు. తాజాగా బుమ్రాపై పాకిస్తాప్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ షాకింగ్స్ కామెంట్స్ చేశారు. బుమ్రా పై పనిభారాన్ని సరిగా నిర్వహించలేకపోవమే ప్రస్తుతం అతను గాయపడటానికి ప్రధాన కారణమని షోయబ్ అక్తర్ స్పష్టం చేశారు.
బుమ్రాను మేనేజ్ మెంట్ సరిగా ఉపయోగించకపోవడం దురదృష్టకరం
బుమ్రా బౌలింగ్ యాక్షన్ వల్ల అతడు వెన్ను గాయానికి గురవుతాయని ఏడాది కిందటే చెప్పిన అక్తర్.. మరో సారి ఇంట్రెస్టింట్ కామెంట్ చేశారు. బుమ్రా ఫ్రంట్ ఆన్ యాక్షన్‌లో బౌలింగ్ చేస్తాడని, దీంతో అతని వెన్నుపై చాలా భారం పడుతుందని, తమలాంటి బౌలర్లకు తొడలు, పిరుదులు, ఎడమ చేతుల నుంచి సాయం అంది వెన్నుపై భారం తగ్గుతుందని, బుమ్రాకు అలాంటి అవకాశం లేదని షోయబ్ అక్తర్ వివరించారు. ముఖ్యంగా అతనిపై పనిభారాన్ని టీమిండియా సరిగా మేనేజ్ చేయకపోవడం దురదృష్టకరమని, తాను మేనేజ్ మెంట్‌లో ఉండి ఉంటే ఐదు వన్డేలకు గాను కేవలం మూడు వన్డేలు ఆడించేవాడని తెలిపారు.