LOADING...
WPL 2025: ముంబై ఇండియన్స్ కి షాక్.. చివరి బంతికి దిల్లీ విజయభేరి
ముంబై ఇండియన్స్ కి షాక్.. చివరి బంతికి దిల్లీ విజయభేరి

WPL 2025: ముంబై ఇండియన్స్ కి షాక్.. చివరి బంతికి దిల్లీ విజయభేరి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై ఇండియన్స్‌ను ఉత్కంఠభరిత పోరులో చివరి బంతికి ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ గొప్ప విజయాన్ని సాధించింది. మ్యాచ్ విజయం ఎవరి సాధనమవుతుందనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. విజయానికి రెండు పరుగులు అవసరమైన సమయంలో అరుంధతి రెడ్డి తెలివిగా ఆడుతూ రెండుపరుగులు పూర్తి చేసి దిల్లీకి గెలుపును అందించింది. దీంతో ముంబై ఇండియన్స్ నిరాశకు గురైంది. మ్యాచ్‌లో మొదటగా టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయినా చివరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది.

Details

చివరి బంతికి రెండు పరుగులు చేసిన అరుంధతి రెడ్డి

విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ కీలక ఓవర్‌ను ముంబై కెప్టెన్ ఎస్ సంజనకు అప్పగించింది. మొదటి బంతికే నిక్కీ ప్రసాద్ బౌండరీ కొట్టింది. రెండో బంతికి రెండు పరుగులు రాగా, మూడో, నాలుగో బంతులకు ఒక్కో పరుగు వచ్చింది. ఐదో బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో నిక్కీ ప్రసాద్ ఔటయ్యింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో, అరుంధతి రెడ్డి చాకచక్యంగా ఆడి రెండుపరుగులు పూర్తి చేసి ఢిల్లీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ముంబై ఇండియన్స్ తరఫున నాట్ స్కివేర్-బృంట్ 80 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 42 పరుగులు సాధించగా, మిగతా బ్యాట్స్‌వుమెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Details

నిక్కీ ప్రసాద్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

ఢిల్లీ బౌలర్ అన్నాబెల్ సుతేర్లాండ్ 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన ఇచ్చింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి మంచి ఆరంభం లభించింది. షఫాలీ వర్మ 18 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి మెరిసింది. నిక్కీ ప్రసాద్ 35 పరుగులతో రాణించడంతో ఢిల్లీ ఉత్కంఠభరిత పోరులో గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రతిభ చూపిన నిక్కీ ప్రసాద్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది.