Page Loader
Rohit Sharma: టీమిండియాకు షాక్! రోహిత్ శర్మకు గాయం.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడతాడా?
టీమిండియాకు షాక్! రోహిత్ శర్మకు గాయం.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడతాడా?

Rohit Sharma: టీమిండియాకు షాక్! రోహిత్ శర్మకు గాయం.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడతాడా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో టీమిండియా రాణిస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలు సాధించిన భారత్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా కివీస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మార్చి 2న జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను ఆక్రమిస్తుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది.

Details

ప్రాక్టీస్‌కు హాజరుకాని రోహిత్

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిట్ మ్యాన్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బుధవారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. అయితే రోహిత్ శర్మ మాత్రం ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ రోహిత్ తొడ కండర నొప్పితో ఇబ్బంది పడినట్లు కనిపించింది. దీంతో కివీస్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Details

గిల్ కెప్టెన్సీ చేపట్టే ఛాన్స్

రోహిత్ దూరమైతే వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ జట్టును నడిపించే అవకాశం ఉంది. అలాగే తుది జట్టులో కొన్ని మార్పులు కూడా ఉండొచ్చు. మహ్మద్ షమీకి కూడా ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చి, అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం. ఒకవేళ రోహిత్ శర్మ గైర్హాజరైతే, కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడే అవకాశముంది. రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడానికి వికెట్ కీపర్-బాట్స్‌మెన్ రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే టీమిండియా సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నా కివీస్‌పై గెలిచి గ్రూప్-ఏ టాపర్‌గా నిలవాలనే లక్ష్యంతో ఉంది. మ్యాచ్‌కు ఇంకా మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.