LOADING...
Shreyanka Patil : టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ స్పిన్నర్ టోర్నీకి దూరం
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ స్పిన్నర్ టోర్నీకి దూరం

Shreyanka Patil : టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ స్పిన్నర్ టోర్నీకి దూరం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 19, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వరుస విజయాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్న భారత మహిళల జట్టుకు అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన ఆఫ్‌స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడటంతో మిగిలిన టోర్నమెంట్ మొత్తానికి దూరమైంది. జూన్ 17న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శ్రేయాంకకు గాయం అయింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ తొలి బంతిని అడ్డుకునే ప్రయత్నంలో ఆమె కుడికాలు మెలికపడి మైదానంలోనే కుప్పకూలింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెకు ఫిజియో వెంటనే ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో సహాయక సిబ్బంది స్ట్రెచర్‌పై ఆమెను మైదానం వెలుపలికి తరలించారు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు.

వివరాలు

జట్టులో ఆ మార్పులు చేసిన ఐసీసీ..

వైద్యుల అంచనా ప్రకారం కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరమవుతుండటంతో శ్రేయాంక పాటిల్ మిగిలిన టోర్నమెంట్‌కు అందుబాటులో ఉండబోదని స్పష్టమైంది. శ్రేయాంక స్థానంలో యువ లెగ్‌స్పిన్నర్ ప్రేమా రావత్‌ను భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మార్పుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెక్నికల్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది.

వివరాలు

పలు టోర్నమెంట్లలో ప్రతిభ..

24 ఏళ్ల ప్రేమా రావత్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయకపోయినా, ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లలో తన ప్రతిభను చాటుకుంది. ఇండియా-ఏ జట్టు తరఫున ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ పోటీల్లో ఎనిమిది వికెట్లు సాధించింది. డబ్ల్యూపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున రెండు సీజన్లు ఆడిన ప్రేమా రావత్, మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. అలాగే దేశీయ క్రికెట్‌లో ఉత్తరాఖండ్ జట్టు విజయాల్లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..

Advertisement