Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు 'బెస్ట్ ఫీల్డర్' అవార్డు.. ఈసారి ప్రత్యేక అతిథి ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా, ఫైనల్లోకి ప్రవేశించింది.
బ్యాటింగ్‌లో రాణించిన విరాట్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ, జోష్ ఇంగ్లిస్ క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. అందరూ కోహ్లీకే 'బెస్ట్ ఫీల్డర్' అవార్డు దక్కుతుందని ఊహించారు. అయితే ఈసారి ఈ గౌరవం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను వరించింది.
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో దూకుడుగా ఆడుతున్న అలెక్స్ కేరీ రనౌట్ కావడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. నేరుగా స్టంప్స్‌ను గిరాటడం ద్వారా కేరీ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
ఫీల్డింగ్‌లో అతని ఈ అద్భుత కృషి కారణంగా 'బెస్ట్ ఫీల్డర్' మెడల్ అయ్యర్‌కు దక్కింది.
Details
రవిశాస్త్రి చేతులమీదుగా అవార్డు
ఇంతకుముందు శిఖర్ ధావన్ డ్రెస్సింగ్ రూమ్‌లో మెడల్ అందించగా, ఈసారి ప్రత్యేక అతిథిగా భారత మాజీ ప్రధాన కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి (Ravi Shastri) వచ్చారు.
టీమ్‌ను అభినందించిన తర్వాత, శ్రేయస్ అయ్యర్‌కు 'బెస్ట్ ఫీల్డర్' మెడల్‌ను అందజేశారు. సాధారణంగా 'బెస్ట్ ఫీల్డర్' మెడల్ కోసం ముగ్గురినే ఎంపిక చేస్తారు.
కానీ ఈసారి ఆసీస్‌తో జరిగిన సెమీస్ తర్వాత నలుగురిని నామినేట్ చేశారు.
శ్రేయస్ అయ్యర్‌తో పాటు విరాట్ కోహ్లీ (Virat Kohli), రవీంద్ర జడేజా (Ravindra Jadeja), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఈ జాబితాలో ఉన్నారు.
Details
ఫైనల్‌కు సిద్ధమైన భారత్
ఫీల్డింగ్ కోచ్ దిలీప్, నలుగురి ఫీల్డింగ్ కృషిని ప్రశంసించి, భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగించాలని అభినందించారు.
ఈ విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు అర్హత సాధించింది.
మార్చి 9న జరిగే ఫైనల్‌లో, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో తలపడనుంది.