Shubman Gill: శుభమన్ గిల్ సూపర్ క్లాస్ ఇన్నింగ్స్.. వన్డేల్లో ఏడో శతకం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో శుభమన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో శతకం నమోదు చేశాడు.
ఈ సిరీస్‌లో తన ప్రతిభను ప్రదర్శిస్తూ వన్డేల్లో క్లాస్ ఇన్నింగ్స్ అంటే ఏమిటో నిరూపించాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కేవలం 95 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మూడో వన్డే నిర్వహించగా, టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. సెంచరీ స్పెషలిస్ట్ రోహిత్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
అనంతరం వచ్చిన విరాట్ కోహ్లితో కలిసి శుభమన్ గిల్ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు.
వివరాలు
హాఫ్ సెంచరీతో అదరగొట్టిన విరాట్,శ్రేయాస్ అయ్యర్
గిల్ 14 బౌండరీలు, 3 సిక్సర్లతో 95 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు.
రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
విరాట్ కోహ్లి 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 55 బంతుల్లో 52 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
శుభమన్ గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో అర్ధ శతకాలు, మూడో వన్డేలో శతకంతో అదరగొట్టాడు.
మొదటి వన్డేలో 87, రెండో వన్డేలో 60, మూడో వన్డేలో 112 పరుగులతో మొత్తం 259 పరుగులు చేశాడు.