Page Loader
ICC ODI Rankings: వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ గా శుభ్‌మన్‌ గిల్.. టాప్‌-10లో ఉన్న మనోళ్లు వీరే..
వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ గా శుభ్‌మన్‌ గిల్.. టాప్‌-10లో ఉన్న మనోళ్లు వీరే..

ICC ODI Rankings: వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ గా శుభ్‌మన్‌ గిల్.. టాప్‌-10లో ఉన్న మనోళ్లు వీరే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC)వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. గతంలో ఈ స్థానం ఆక్రమించిన బాబర్ అజంను వెనక్కి నెట్టి, గిల్ నెంబర్ వన్‌గా నిలిచాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గిల్ 102బంతుల్లో 112పరుగులు చేయడం తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా 142పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్ ఓ సెంచరీ, రెండు అర్ధశతకాలు నమోదు చేసి, మొత్తం 259పరుగులు చేశాడు.అతడు 86.33సగటుతో రాణించాడు. గత వారం గిల్,బాబర్ అజం కంటే కేవలం 5 పాయింట్లు వెనుకబడి ఉండగా,ఇప్పుడు పరిస్థితి మారింది.

వివరాలు 

టాప్ 10లో నలుగురు భారత ఆటగాళ్లు

తాజాగా బాబర్ 13 పాయింట్లు కోల్పోగా, గిల్ 15 పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ ఖాతాలో 796 పాయింట్లు ఉండగా, బాబర్ అజంకు 776 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్ 10లో నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు. శుభ్‌మన్ గిల్ తరువాత, రోహిత్ శర్మ మూడో (773 పాయింట్లు), విరాట్ కోహ్లీ ఆరవ (6వ స్థానం), శ్రేయాస్ అయ్యర్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. నిన్నటి వరకు బాబర్ అజంకు 786 పాయింట్లు ఉండగా,శుభ్‌మన్ గిల్‌కు 781 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం,గిల్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.మరోవైపు, రోహిత్ శర్మ తన మూడో స్థానాన్ని పదిలంగా కొనసాగిస్తున్నాడు.