
ENG vs IND: ఆ ప్లాన్ ఫలించకపోవడంతోనే సిరాజ్ అసహనం: గిల్
ఈ వార్తాకథనం ఏంటి
ఓవల్ టెస్టులో క్రిస్ వోక్స్ చేతికి కట్టుతో ఆడుతుండగా, మరోవైపు గస్ అట్కిన్సన్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. భారత్ జట్టు ముందుగానే ప్రత్యేక ప్రణాళికతో బంతులు వేస్తుండగా, నిర్దిష్టంగా అమలు చేయాల్సిన దశలో రనౌట్ అవకాశాన్ని కోల్పోయారు. ఆ సందర్భంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌పై మహ్మద్ సిరాజ్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే అనంతరం అదే సిరాజ్ అట్కిన్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి జట్టుకు విజయం అందించాడు. ఈ ఘటనపై మ్యాచ్ అనంతర మీడియా సమావేశంలో శుభమన్ గిల్ స్పందించాడు.
వివరాలు
ఓవర్ చివరి బంతికి సింగిల్ రాకుండా..
"మేము ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించాం.చివరి ఓవర్‌లో వైడ్ యార్కర్ వేయాలని నిర్ణయించుకున్నాం. అట్కిన్సన్ బ్యాటింగ్‌లో ఉండగా వోక్స్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా అతడినే ఎదుర్కొనాలని ఉద్దేశం.ఓవర్ చివరి బంతికి సింగిల్ రాకుండా ఉంటే,వోక్స్ మళ్లీ స్ట్రైక్‌లోకి వస్తాడు.ఆ సమయంలో అతడు సిక్స్ కొట్టడానికి ప్రయత్నించవచ్చని అంచనా. అలా అయితే వికెట్ తీసే అవకాశం లేదా రనౌట్ చేసే అవకాశం ఉంటుంది," అని గిల్ వివరించాడు.
వివరాలు
ఈ మ్యాచ్‌లో మేం ఓడినా సరే ఆ గౌరవం అలాగే ఉంటుంది
"ఈ కోణంలోనే సిరాజ్ ముందు జాగ్రత్తగా వికెట్ కీపర్ ధ్రువ్‌కి గ్లోవ్స్ తీయించి రెడీగా ఉండమని సూచించాడు.కానీ,నేను అది ధ్రువ్‌కి చెప్పేలోపే సిరాజ్ బంతిని వేసేయడం మొదలు పెట్టాడు. దీంతో రనౌట్ చేసే అవకాశాన్ని మిస్ అయ్యాం.ఆ సందర్భంలోనే సిరాజ్ నాతో..'ధ్రువ్‌కు ముందే ఎందుకు చెప్పలేదు?'అని ప్రశ్నించాడు.అప్పుడు అక్కడ జరిగిందదే," అని గిల్ చెప్పాడు. "అయితే మేము మొదట నుంచి సిరాజ్‌పై నమ్మకం ఉంచాం. అతడే ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. ఒక్క క్యాచ్ తప్పిపోయినంత మాత్రాన అతడిపై గౌరవం తగ్గదు. అతడి ప్రదర్శన అసాధారణం. ఈ మ్యాచ్‌లో మేము గెలిచినా, ఓడినా - అతడి ప్రతిభకు, కృషికి మా గౌరవం ఎప్పటికీ మిగిలే ఉంటుంది," అని గిల్ తేల్చిచెప్పాడు.