LOADING...
Shubman Gill: వేలంలో శుభమన్ గిల్ జెర్సీకి రూ. 5.41 లక్షలు! 
వేలంలో శుభమన్ గిల్ జెర్సీకి రూ. 5.41 లక్షలు! Add Image

Shubman Gill: వేలంలో శుభమన్ గిల్ జెర్సీకి రూ. 5.41 లక్షలు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమ్‌ ఇండియా కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌, ఆ సిరీస్‌లో పోటీపడిన ఆటగాళ్ల జెర్సీల వేలంపాటలో కూడా అగ్రస్థానాన్ని సాధించాడు. గిల్‌ ధరించిన జెర్సీ రూ.5 లక్షల 41 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. భారత్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఆ సిరీస్‌లో ఉపయోగించిన జెర్సీలు, టోపీలను రెడ్‌రూత్‌ స్పెషల్‌ టైమ్డ్‌ వేలంలో ఉంచగా, వాటిలో గిల్‌ జెర్సీకే అత్యధిక ధర లభించింది. రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా జెర్సీలు తలా రూ.4.94 లక్షలకు విక్రయించబడ్డాయి. ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌ జెర్సీ రూ.4.70 లక్షలకు అమ్ముడైంది. రిషబ్‌ పంత్‌ జెర్సీ రూ.4 లక్షలకు దక్కింది.

వివరాలు 

రూత్‌-స్ట్రాస్‌ ఫౌండేషన్‌కు విరాళంగా వేలం ద్వారా వచ్చిన మొత్తం 

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లలో జో రూట్‌ జెర్సీ రూ.4.47 లక్షలకు, బెన్‌ స్టోక్స్‌ జెర్సీ రూ.4 లక్షలకు అమ్ముడయ్యాయి. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని రూత్‌-స్ట్రాస్‌ ఫౌండేషన్‌కు విరాళంగా అందజేయనున్నారు. 2-2తో డ్రాగా ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఒక ద్విశతకం, మూడు సెంచరీలతో కలిపి మొత్తం 754 పరుగులు సాధించాడు.