LOADING...
Shubman Gill: విరాట్ కోహ్లి రికార్డులను టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ దాటేస్తాడా..?
విరాట్ కోహ్లి రికార్డులను టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ దాటేస్తాడా..?

Shubman Gill: విరాట్ కోహ్లి రికార్డులను టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ దాటేస్తాడా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో రికార్డుల గురించి మాట్లాడితే, ముందుగా మనకు గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్. ప్రస్తుత తరం అంటే విరాట్ కోహ్లీ. భవిష్యత్తులో అయితే మనం శుభమన్ గిల్ పేరును తరచుగా వినాల్సి రావచ్చు. తాజా గణాంకాల ప్రకారం, వన్డేల్లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో శుభమన్ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.

వివరాలు 

ఫాస్టెస్ట్ 2500 వన్డే పరుగులు  

ఇరవై ఐదేళ్ల టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో వేగంగా 2500 పరుగులు చేసిన బ్యాటర్‌గా అతను నిలిచాడు. గిల్ తన 50వ వన్డేలో ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు హషీమ్ ఆమ్లా (51 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. గిల్ ప్రదర్శన చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సులభంగా అధిగమిస్తాడనిపిస్తోంది.

వివరాలు 

కోహ్లిని మించిన గిల్ - అద్భుత బ్యాటింగ్ నంబర్లు 

తొలి 50 వన్డేల్లో విరాట్ కోహ్లికి మించి శుభమన్ గిల్ ఎక్కువ పరుగులు సాధించాడు. సెంచరీలు, హాఫ్ సెంచరీలు, స్ట్రయిక్ రేట్, యావరేజ్ ఇలా ఏ కోణంలో చూసినా గిల్‌దే పైచేయి. విరాట్ కోహ్లి తన మొదటి 50 వన్డేల్లో 47 ఇన్నింగ్స్‌ల్లో 1827 పరుగులు చేశాడు. 118 అత్యధిక స్కోర్‌తో, 12 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు సాధించాడు. 83.04 స్ట్రయిక్ రేట్, 45.67 యావరేజ్‌తో రాణించాడు. అయితే, శుభమన్ గిల్ మాత్రం తన మొదటి 50 వన్డేల్లో 50 ఇన్నింగ్స్‌లు ఆడి 2587 పరుగులు చేశాడు. 208 అత్యధిక స్కోర్‌తో, 15 హాఫ్ సెంచరీలు, 7 సెంచరీలు సాధించాడు. 101.93 స్ట్రయిక్ రేట్, 60.16 యావరేజ్‌తో అదరగొట్టాడు.

Advertisement

వివరాలు 

అన్ని ఫార్మాట్లలో దూసుకెళ్తున్న గిల్ 

అన్ని ఫార్మాట్లలో కలిపి గిల్ ఇప్పటికే 5000కి పైగా పరుగులు చేశాడు. టెస్టులు - 32 టెస్టులలో 128 అత్యధిక స్కోర్‌తో 1893 పరుగులు, 5 సెంచరీలు. టీ20లు - 21 మ్యాచ్‌లలో 126 అత్యధిక స్కోర్‌తో 578 పరుగులు. టీమిండియాకు శుభవార్త గిల్ ఫామ్‌లో ఉండటం శుభమన్ గిల్ అద్భుత ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో అతని ప్రదర్శన జట్టుకు కలిసొస్తుంది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ గిల్ అద్భుతంగా రాణించాడు. 3 వన్డేల్లో 259 పరుగులు ప్రతీ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్ దాటి, వికెట్ కాపాడుకుంటూ, జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. అతని స్థిరత టీమిండియాకు విజయాల్లో కీలకంగా మారుతోంది.

Advertisement

వివరాలు 

శుభమన్ గిల్ భవిష్యత్‌ 

గిల్ ప్రదర్శన చూస్తుంటే, అతను రానున్న కాలంలో మరిన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కోహ్లి తర్వాత భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లే వారిలో అతను ముందు వరుసలో ఉండటం ఖాయం!

Advertisement