బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన సికిందర్ రాజా.. ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు
వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఆతిథ్య జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సికిందర్ రాజా బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించడంతో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో తేడాతో నెదర్లాండ్స్ పై నెగ్గింది. జింబాబ్వే విజయంలో కెప్టెన్ ఇర్విన్, విలియమ్స్, సికిందర్ రాజా కీలక పాత్ర పోషించారు. దీంతో సూపర్ 6లో చోటు సాధించే అవకాశాలను ఆ జట్టు మెరుగుపరుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 50 ఓవర్లలో 315 పరుగుల చేసింది. ఎడ్వర్డ్స్ 83, విక్రమ్ జీత్ 88 పరుగులతో రాణించారు. సికిందర్ రాజా 4 వికెట్లతో రాణించారు. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ క్రెయిన్ ఇర్విన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సికిందర్ రాజా కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
యూఎస్ఏపై గెలుపొందిన నేపాల్ జట్టు
జింబాబ్వే తరుపున అత్యంత వేంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా సికిందర్ రాజా నిలిచాడు. దీంతో జింబాబ్వే 40.5 ఓవర్లలోనే 4 వికెట్లు లక్ష్యాన్ని చేధించింది. మరో మ్యాచులో యూఎస్ఏపై నేపాల్ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 207 పరుగులు చేసింది. ఆ జట్టు లో జహంగీర్ సెంచరీతో మెరిశాడు. లక్ష్య చేధనకు దిగిన నేపాల్ టార్గెట్‌ను సునాయాసంగా జయించింది. కేవలం 43 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించడం విశేషం. నేపాల్ బ్యాటర్లలో భీమ్ షర్కి 77, కుశల్ 39, దీపేంద్ర సింగ్ 39 పరుగులతో ఫర్వాలేదనిపించారు.