Mohammed Siraj: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో సిరాజ్ పుంజుకోవడం వెనక బుమ్రా సలహాలు
న్యూజిలాండ్‌తో సొంత ఇండియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో (IND vs NZ) నిరాశజనక ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు (AUS vs IND)లో 5 వికెట్లు తీసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ ప్రదర్శన వెనుక జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) సలహాలు ప్రధాన పాత్ర పోషించాయని,ఈ విజయానికి ఆయనకే క్రెడిట్ అని సిరాజ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన 0-3 వైట్‌వాష్ టెస్టు సిరీస్‌లో సిరాజ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసాడు. కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్లు సాధించి చక్కటి పునరాగమనం చేశాడు.
భరత్ అరుణ్ సలహాలు
ఈ విజయానికి బుమ్రా ఇచ్చిన సలహాలే కారణమని సిరాజ్ చెప్పాడు. "బుమ్రా భాయ్‌తో నేను తరచూ మాట్లాడుతుంటా. మొదటి మ్యాచ్‌కు ముందు కూడా అతనితో చర్చించాను. నా బౌలింగ్‌లో ఎదురవుతున్న సమస్యల గురించి చెప్పాను. ఆయన ఒకే మాట చెప్పాడు, 'వికెట్ల కోసం మాత్రమే ప్రయత్నించకు. ఒకే ప్రాంతంలో నిలకడగా బంతులు వేయడానికి కృషి చేయు. బౌలింగ్‌ను ఆస్వాదించు. అయినా వికెట్లు రాకపోతే మళ్లీ నాతో మాట్లాడు,' అని నన్ను ప్రోత్సహించాడు. ఈ సూచనలతో నేను నా బౌలింగ్‌ను మార్చుకున్నాను, వికెట్లు సాధించాను," అంటూ సిరాజ్ వివరించాడు. మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా తనకు సలహాలు ఇచ్చినట్లు సిరాజ్ తెలిపారు.
భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం
భరత్ అరుణ్ తన బౌలింగ్‌ను చాలా కాలంగా గమనించి,ఎంతో ఉపయోగకరమైన సూచనలు అందించినట్లు పేర్కొన్నాడు. పెర్త్ టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే కుప్పకూలినా,బుమ్రా నేతృత్వంలోని పేసర్లు ప్రత్యర్థి జట్టును 104 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లు తీసినప్పుడు సిరాజ్ రెండు వికెట్లు సాధించాడు.రెండో ఇన్నింగ్స్‌లో కూడా బుమ్రా, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి జట్టును విజయపథంలో నిలిపారు. ఈ విజయాలతో ప్రేరణ పొందిన సిరాజ్ ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 1/18 తో రాణించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.