Page Loader
Sourav Ganguly Birthday: దాదా సాధించిన కొన్ని విజయాలపై లుక్కేద్దాం
టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ

Sourav Ganguly Birthday: దాదా సాధించిన కొన్ని విజయాలపై లుక్కేద్దాం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 08, 2023
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ తన అద్భుతమైన కెప్టెన్సీతో భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. దాదా శనివారం 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గంగూలీ సాధించిన మరుపురాని విజయాలను కొన్ని తెలుసుకుందాం. 1972, జులై 8న కోల్‌కతాలో సౌరబ్ గంగూలీ జన్మించారు. అతన్ని అభిమానులు ముద్దుగా దాదా, ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా అని పిలుచుకుంటారు. 1992లో వెస్టిండీస్‌పై దాదా వన్డే అరంగ్రేటం చేశారు. 1996లో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో గంగూలీ అరంగ్రేటం చేశారు. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈఅరంగేట్ర మ్యాచులో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలాగే ఇదే సిరీస్‌లో రెండో టెస్ట్‌లోనూ సెంచరీ బాదేశారు. దీంతో అరంగేట్ర సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన మూడో క్రికెటర్‌గా రికార్డుకెక్కారు.

Details

2000లో టీమిండియా సారిథిగా కొనసాగిన గంగూలీ 

2000లో టీమిండియా జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకుంది. ఆ సమయంలోనే జట్టుకు గంగూలీ కెప్టెన్‌గా నియమితుడయ్యారు. 2001లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించింది. ఇక ఇంగ్లండ్ జట్టుతో జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో లార్డ్స్ బాల్కనీలో దాదా చొక్కా విప్పిన సంఘటన అభిమానులకు ఇప్పటికీ గుర్తే. గంగూలీ చివరిసారిగా 2008లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడారు. 2012 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడారు. దాదా భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 18,575 పరుగులు చేశారు. టీమిండియాకు 195 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి, 97 విజయాలను అందించాడు.

Details

2004లో పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ను గెలుచుకున్న టీమిండియా

1999 ప్రపంచకప్‌లో గంగూలీ శ్రీలంకపై 183 పరుగులు చేసిన ఇన్నింగ్స్ ఇప్పటికి అభిమానులు మరిచిపోలేరు.ఈ మ్యాచులో రాహుల్ ద్రావిడ్ కలిసి 318 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2003 ప్రపంచ కప్‌లో దాదా సారథ్యంలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో భారత జట్టు, ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. 2004లో పాక్‌లో పర్యటించిన టీమిండియా, అక్కడ టెస్టు సిరీస్‌ను దాదా సారథ్యంలో భారత్ గెలుచుకొని రికార్డు సృష్టించింది.