IND vs SA 2nd ODI: రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం.. తేలిపోయిన భారత బౌలర్లు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా రెండో వన్డేల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
సౌతాఫ్రికా ఓపెనర్ జోర్జి సెంచరీతో చెలరేగడంతో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత్ నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. దీంతో వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
టోని డి జోర్జి 122 బంతుల్లో 119* రన్స్‌తో చేలరేగాడు.
హెండ్రిక్స్ 81 బంతుల్లో 52, వాండెర్ డసెన్ 51 బంతుల్లో 36 పరుగులతో రాణించారు.
Details
విఫలమైన భారత్ టాప్ ఆర్డర్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లలో సాయి సుదర్శన్ 83 బంతుల్లో 62 పరుగులు, కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 56 పరుగులు చేశారు.
మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో పూర్తి ఓవర్లు ఆడకుండానే భారత్ ఆలౌటైంది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్ 3, హెండ్రిక్స్ 2, కేశవ్ మహారాజ్ 2, మార్క్రమ్, లిజాడ్ విలియమ్స్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
సాయి సుదర్శన్ ఔట్ అయిన తర్వాత భారత్ బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. సంజుశాంసన్(12), రింకూసింగ్(17), అక్షర్ పటేల్ (7), కుల్దీప్ యాదవ్ (1) త్వరగానే పెవిలియన్ బాట పట్టారు.
ఇక మూడో వన్డే గురువారం జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.