
HCA: హెచ్‌సీఏపై 'విజి'లెన్స్' .. సన్‌రైజర్స్‌ను వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన వివాదంపై స్పందించారు.
ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు బెదిరించినందుకు సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడి వేధింపులు, సంఘం పాలన, సన్‌రైజర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ సోమవారం విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి సీఎం ఆదేశాలు జారీచేశారు.
వివరాలు
క్రికెట్ అభిమానులు,రాజకీయ వర్గాల్లో చర్చలు
ఉచిత పాస్‌ల కోసం బ్లాక్‌మెయిల్ కారణంగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ హైదరాబాదును వదిలిపోతామని పేర్కొన్న లేఖపై 'ప్రముఖ మీడియా' కథనం సంచలనం సృష్టించింది.
ఈ విషయంపై క్రికెట్ అభిమానులు,రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగాయి.
సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, హెచ్‌సీఏ సభ్యులెవరైనా సన్‌రైజర్స్ ఫ్రాంచైజీని వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం కలిగించే ఎలాంటి చర్యలనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
సీఎం ఆదేశాల మేరకు, హెచ్‌సీఏ అధ్యక్షుడు చేసిన వ్యవహారం, టిక్కెట్ల అమ్మకం, కొనుగోలు, బ్లాక్ లో విక్రయాలు, క్రికెట్ సంఘం రోజువారీ పరిపాలనపై విజిలెన్స్ శాఖ సమగ్ర విచారణ చేపట్టనుంది.
వివరాలు
ఫిబ్రవరిలో హెచ్‌సీఏ అధ్యక్షుడు, సన్‌రైజర్స్ యాజమాన్య మధ్య విభేదాలు
అదే జరిగితే, హెచ్‌సీఏలో ఆర్థిక అవకతవకలు, జట్ల సెలెక్షన్లు వంటివి వెలుగులోకి రావచ్చునని అంచనా వేస్తున్నారు.
''నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వాళ్లకు కఠిన చర్యలు తప్పవు. బాధ్యులు ఎవరైనా తప్పించుకోలేరు'' అని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐపీఎల్ సన్నాహాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు, సన్‌రైజర్స్ యాజమాన్య మధ్య విభేదాలు మొదలయ్యాయి.
ఉప్పల్ స్టేడియం ఆధునికీకరణ విషయంలో మొదలైన ఈ విభేదాలు, ఐపీఎల్ పాస్‌లు, టిక్కెట్ల వ్యవహారంతో మరింత తీవ్రత పెరిగాయి.
సన్‌రైజర్స్ టిక్కెట్ల అమ్మకం మరియు ఇతర వ్యాపారాలపై హెచ్‌సీఏ అధ్యక్షుడితో వివాదాలు తలెత్తాయి.
వివరాలు
హెచ్‌సీఏ అధ్యక్షుడి ప్రవర్తనపై సన్‌రైజర్స్ ఆందోళన
సన్‌రైజర్స్ అభ్యంతరాలను తెలియజేస్తూ, "సన్‌రైజర్స్ సిబ్బందిని బెదిరించడం, టిక్కెట్ల కొనుగోలుకు ఒత్తిడి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటం" అంటూ హెచ్‌సీఏ పై తీవ్ర ఆరోపణలు చేసింది.
27 తేదీన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు హెచ్‌సీఏ అధ్యక్షుడి ప్రవర్తనపై సన్‌రైజర్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
"హెచ్‌సీఏ కార్యదర్శి, సీఈఓ ఇతర సభ్యులతో మేము సహకరిస్తున్నాము. కానీ హెచ్‌సీఏ అధ్యక్షుడి ప్రవర్తన వలన మాకు సమస్యలు వస్తున్నాయి. బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతామనేది మా నిర్ణయం" అని సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ తెలిపారు.