
శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగే ప్రమాదకర బౌలర్ : కేఎల్ రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ సూపర్-3 మ్యాచులో టీమిండియాపై ఐదు వికెట్లతో చెలరేగిన దునిత్ వెల్లాలగే గురించి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ సాగుతోంది.
కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచులో దుతిల్ వెల్లలాగే అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకున్నాడు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ను పెవిలియానికి పంపించడమే కాకుండా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా వికెట్లను తీసి భారత జట్టుకు ముచ్చెటమలు పట్టించాడు.
మరోవైపు బ్యాటింగ్‌లోనూ చివరి వరకూ శ్రీలంక తరుపున పోరాడాడు. 10 వికెట్లు పడినా కూడా చివరి వరకూ నిలిచి 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగే వ్యతిరేకంగా తాము తదుపరి మ్యాచులో భిన్నమైన దృక్ఫథంతో ముందుకొస్తామని ప్రకటించాడు.
Details
దునిత్ వెల్లాలగే అద్భుతంగా రాణించాడు : రాహుల్
శ్రీలంక తరుఫున ఇప్పటి వరకు తాను చూసిన వారిలో ఎంతో ప్రమాదకరమైన బౌలర్ దునిత్ వెల్లాలగే అని, టాపార్డర్‌లో ఐదు వికెట్లు తీయడం అతడికి కలిసొచ్చిందని, బ్యాటింగ్ లోనూ అతడు రాణించాడని కేఎల్ రాహుల్ పేర్కొన్నారు.
ఒకవేళ ఫైనల్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడితే దునిత్ వెల్లాలగే అని సమర్థవంతంగా ఎదుర్కొంటామని రాహుల్ తెలిపారు.
ఒకవేళ సూపర్-4లో పాకిస్థాన్‌ను శ్రీలంక ఓడిస్తే, మరోసారి భారత్, శ్రీలంక జట్లు తలపడే అవకాశం ఉంది. అదే జరిగితే దునిత్ వెల్లాలగే అని భారత క్రికెటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.