Page Loader
Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్
స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్

Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ బౌలర్, లక్నో సూపర్‌జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మయాంక్ యాదవ్ మళ్లీ గాయపడ్డాడు. తన స్పీడ్‌తో అభిమానులను మెప్పించిన మయాంక్ వెన్నులో గాయం కారణంగా ఐపీఎల్ 2025 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారిక ప్రకటనలో వెల్లడించగా, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఈ విషయాన్ని ధృవీకరించింది. మయాంక్ స్థానంలో న్యూజిలాండ్ పేసర్ విలియమ్ ఒరూర్క్‌ను లక్నో జట్టులోకి తీసుకుంది. మయాంక్‌కు ఇదే ఏడాది ఇది మూడోసారి గాయం కావడం గమనార్హం. గతంలో గాయం నుంచి కోలుకొని సీజన్ మధ్యలో లక్నో జట్టులో మళ్లీ చేరాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీం పర్యవేక్షణలో 6 నెలల పాటు మయాంక్ చికిత్స పొందాడు.

Details

మయాంక్ స్థానంలో విలియమ్ ఒరూర్క్

ఇక ఐపీఎల్ 2025లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే, గాయం ప్రభావంతో ఆయన స్పీడ్ కూడా తగ్గినట్లు కనిపించింది. రెండు మ్యాచ్‌ల తర్వాత మళ్లీ వెన్నుగాయం పట్టేయడంతో మయాంక్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన తిరిగి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు వెళ్లనున్నాడు. మయాంక్ తరచూ గాయాల బారిన పడుతుండటంతో అతడి భవిష్యత్ క్రికెట్ కెరీర్‌పై ప్రశ్నలు రావడం ప్రారంభమైంది. అతడి స్థానంలో వచ్చిన విలియమ్ ఒరూర్క్‌ను లక్నో రూ.3 కోట్ల రిజర్వ్ ధరతో సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టులో ఓ కీలక పేసర్‌గా గుర్తింపు పొందిన ఒరూర్క్, భారత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో కివీస్‌కు క్లీన్ స్వీప్ విజయాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి.