Sunil Gavaskar : భారత్.. వినడానికి వినసంపుగా ఉంది : సునీల్ గవాస్కర్
ప్రస్తుతం 'ఇండియా' పేరును ఆంగ్లంలో 'భారత్' గా మార్చతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా స్పందించారు. ఈ తరుణంలో 'భారత్' పేరుపై చర్చ నేపథ్యంలో లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. మన దేశం అసలు పేరు భారత్ అని, ఇది వినడానికి కూడా చాలా బాగుందని, దీనిపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని గవాస్కర్ చెప్పారు. బీసీసీఐ స్థాయిలో మన జట్టును 'భారత క్రికెట్ టీమ్' అని పిలవాలని, ఇదివరకు పలు దేశాల్లో పేర్లను మార్చారని, ఇది అన్ని స్థాయిల్లో మారాల్సి ఉందని ఆయన వెల్లడించారు.
'టీమ్ భారత్' జెర్సీలతో ఆటగాళ్లు బరిలోకి దిగాలి : సెహ్వాగ్
ఈ వ్యవహరంపై టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. త్వరలో ఇండియా వేదికగా జరగే వన్డే ప్రపంచ కప్‌లో ఆటగాళ్లు టీమిండియా బదులు 'టీమ్ భారత్' జెర్సీలతో బరిలోకి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు. మరోవైపు సెప్టెంబర్‌లో జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో దేశ అధికారిక పేరును 'భారత్' గా మార్చే తీర్మానాన్ని ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.