Page Loader
తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ మార్పు
ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా భువనేశ్వర్

తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ మార్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2023
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

తొలి మ్యాచ్‌కు ముందే సన్ రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది. నెదర్లాండ్‌తో సౌతాఫ్రికా వన్డే సిరీస్ ఆడుతోంది. దీంతో మొదటి మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ ఐడెన్ మార్ర్కమ్ దూరమయ్యాడు. అతని స్థానంలో టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఏప్రిల్ 2న సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. కెప్టెన్లందరూ ఐపీఎల్ ట్రోఫీలో ఫోటో షూట్ చేశారు. ఇందులో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా భువనేశ్వర్ పాల్గొన్నాడు. భువనేశ్వర్ గతంలో కూడా ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

సన్ రైజర్స్

రెండో మ్యాచ్‌కు అందుబాటులో మార్ర్కమ్

ప్రస్తుతం మార్ర్కమ్ దక్షిణాఫ్రికా తరఫున నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌ ఆడుతుండగా.. అది ముగియగానే నేరుగా జట్టుతో కలువనున్నాడు. ఏప్రిల్ 3న మార్ర్కమ్ భారత్‌కు చేరుకుంటాడు. సన్‌రైజర్స్ రెండో మ్యాచ్ ఏప్రిల్ 7న లక్నో సూపర్‌జెయింట్‌తో జరుగుతుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 146 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్.. మొత్తం 154 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 19 పరుగులకే 5 వికెట్లను ఓసారి పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.