సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. రికార్డులు
ఐపీఎల్ గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అంచనాల్ని అందులేకపోయింది. ఈసారీ భారీ మార్పలతో ఐపీఎల్‌లో అందరి లెక్కలను తేల్చాలని సన్ రైజర్స్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ జట్టులో ప్రస్తుతం భారీ హిట్టర్లు, విధ్వంసకర హిట్టర్లు, యార్కర్ల స్పెషలిస్టులు ఉన్నారు. ప్రస్తుతం వారు సాధించిన రికార్డుల గురించి తెలుసుకుందాం. 2011లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ మొదటగా బెంగళూర్ రాయల్స్‌ఛాలెంజర్స్ తరుపున ఆడాడు. ఆ తర్వాత ఢిల్లీ, రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్‌కింగ్స్ జట్ల తరుపున కీలక మ్యాచ్‌లో రాణించాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ తరుపున ఆడనున్నారు. 113 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అగర్వాల్.. 2331 పరుగులతో ఒక సెంచరీ, 12 అర్ధ సెంచరీలు చేశాడు.
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి రాణించే అవకాశం
అభిషేక్‌శర్మ 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. తర్వాత 2019 నుంచి సన్‌రైజర్స్ జట్టులో కీలక బ్యాట్స్‌మెన్‌గా మారాడు. 36 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి 667 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2017 ఐపీఎల్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరుపున అరంగేట్రం చేసిన రాహుల్ త్రిపాఠి 76 మ్యాచ్‌లో 1798 పరుగులు చేశాడు. ఇందులో పది అర్ధ సెంచరీలు ఉన్నారు. ఐపీఎల్ లో అత్యధికంగా 94 పరుగులు చేశాడు. 2022 నుంచి సన్ రైజర్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. సౌతాఫ్రికా 20 లీగ్‌లో మెరిసిన హెన్రిచ్ క్లాసెస్.. ఇటీవల వెస్టిండీస్‌తో రెండో వన్డేలో 61 బంతుల్లో 119 పరుగులు చేసి సత్తా చాటాడు.
బౌలింగ్ బలంగా సన్ రైజర్స్
టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ చాలా సందర్భాలలో తానేంటో నిరూపించుకున్నాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ 51 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సుందర్ 318 రన్స్ తో పాటు 33 వికెట్లను పడగొట్టాడు. మార్ర్కమ్ సారథ్యంలో ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి సన్ రైజర్స్ ఈస్టర్న్ ఫ్రాంచేజీకి టైటిల్‌ను అందించాడు. సన్ రైజర్స్ తరుపున గతేడాది ఒక్క సీజన్ మాత్రమే ఆడిన మార్క్రమ్ 12 ఇన్నింగ్స్‌లలో 139.05 స్ట్రయిక్‌రేట్‌తో 381 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు నట్‌రాజన్ ఐపీఎల్‌లో 35 మ్యాచ్‌లు ఆడి 38 వికెట్ల తీశాడు. ఉమ్రాన్ మాలిక్ 17 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి సూఫర్ ఫామ్‌లో ఉన్నాడు.
భువనేశ్వర్ సత్తా చాటేనా..?
ఇంతవరకూ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హ్యారీబ్రూక్‌ను సన్‌రైజర్స్ రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. పాక్ సూపర్ లీగ్ 2022లో సెంచరీ చేయడంతో హ్యారీబ్రూక్ వెలుగులోకి వచ్చాడు. ఇప్పటివరకూ 20 టీ20లు ఆడి 372 పరుగులు చేశాడు. ఆదిల్ రషీద్ స్పిన్ విభాగంలో సన్ రైజర్స్ తరుపున మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ 95 అంతర్జాతీయల మ్యాచ్‌లు ఆడిన అదిల్ రషీద్ 95 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ మాత్రం ఐపీఎల్ కెరీర్‌లో మొత్తంగా 1406 డాట్ బాల్స్ వేశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్‌లో 146 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ 7.3 ఎకానమీతో 154 వికెట్లు తీశాడు.