
PAK vs NED: మాకు సపోర్టు చేయండి.. తెలుగులో మాట్లాడిన డచ్ ప్లేయర్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
గతరెండు వార్మప్ మ్యాచుల్లోనూ భారీగా పరుగులు చేసిన పాకిస్థాన్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
ఇక తొలి మ్యాచుల్లోనే పాకిస్థాన్ జట్టుకు షాక్ ఇవ్వాలని నెదర్లాండ్స్ జట్టు భావిస్తోంది.
నెదర్లాండ్స్ వరల్డ్ కప్ జట్టులో తెలుగు మూలాలున్న విజయవాడ వాసి తేజా నిడమనూర్‌కు అవకాశం లభించింది.
నేడు పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా తమ జట్టుకు మద్దతు ఇవ్వాలని తేజా సోషల్ మీడియా ద్వారా కోరారు.
హైదరాబాద్‌కు ఆరెంజ్ అంటే చాలా ఇష్టమని, ఇవాళ పాక్‌తో మ్యాచ్ ఆడుతున్నామని, నెదర్లాండ్స్ జట్టుకు సపోర్టు చేస్తే తాము సంతోష పడతామని అభిమానులను కోరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలుగులో మాట్లాడిన నెదర్లాండ్ ప్లేయర్
A special message in Telugu for Hyderabad from Teja Nidamanuru before our #CWC23 🧡 pic.twitter.com/Tbm9hvbfs1
— Cricket🏏Netherlands (@KNCBcricket) October 5, 2023