టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి షాక్.. కీలక ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు
టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై నమోదైన దాడి, హత్యాయత్నం, గృహహింస కేసుల్లో సుప్రీంకోర్టు కీలక అదేశాలను జారీ చేసింది. ఈ కేసుల విషయంలో నెల రోజుల్లోపు తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు పశ్చిమ్ బంగా సెషన్స్ కోర్టుకు గురువారం స్పష్టం చేసింది. అయితే షమీపై జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను నిలిపివేస్తూ కలకత్తా హైకోర్టు ఈ ఏడాది మార్చి 29న తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అదేశాలను జారీ చేస్తూ అతని సతీమణీ జహాన్ సుప్రీంకోర్టును అశ్రయించింది. ఈ అప్పీల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు నెల రోజుల్లోపు ఈ కేసుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
షమీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న హసీన్ జహాన్
ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంటుంది. గతంలో వయసు విషయంలో షమీ తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించాడని, ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో, బీసీసీఐ విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చింది. గత ఐదేళ్లుగా షమీకి దూరంగా ఉన్న హసీన్ జహాన్ వీలు దొరికినప్పుడల్లా అతనిపై సంచలన ఆరోపణలు చేస్తోంది. షమీకి అనేకమంది వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ పేర్కొంది.