Page Loader
Badminton: సయ్యద్ మోదీ సూపర్ 300.. గాయత్రి-ట్రీసా జోడీ టైటిల్ విజయం
సయ్యద్ మోదీ సూపర్ 300.. గాయత్రి-ట్రీసా జోడీ టైటిల్ విజయం

Badminton: సయ్యద్ మోదీ సూపర్ 300.. గాయత్రి-ట్రీసా జోడీ టైటిల్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2024
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో చైనాకు చెందిన బావో లి జింగ్, లీ కియాన్‌ జోడీని 21-18, 21-11 తేడాతో చిత్తు చేశారు. ఇక ఈ టోర్నీలో తమ తొలి సూపర్ 300 టైటిల్‌ను గెలుచుకుంది. ఇది గాయత్రి-ట్రీసా జోడీకి తొలి సూపర్ 300 టైటిల్‌గా నిలిచింది. అలాగే ఈ జోడీ 2022లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కానీ మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాల్లో భారత జోడీలు నిరాశ పరిచాయి.

Details

ఫైనల్ కు అర్హత సాధించిన పివి.సింధు

మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో 5వ సీడ్‌ అయిన తనీషా-ధ్రువ్‌ జోడీ 21-18, 14-21, 8-21తో థాయ్‌లాండ్‌ జోడీ డెచాపోల్, డెచాపోల్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. అలాగే పురుషుల డబుల్స్ ఫైనల్‌లో పృథ్వీ-ప్రతీక్‌ జోడీ కూడా చైనా జోడీ హువాంగ్ డి, లియు యాంగ్‌ చేతిలో 14-21, 21-19, 17-21 తేడాతో ఓడింది. మరోవైపు పివి.సింధు, లక్ష్యసేన్ మహిళల పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించారు.