ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా పరాజయం పాలైంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్లో జరిగిన ఈ మ్యాచులో 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 58.8 శాతంతో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. ఇందులో మొత్తం 18 మ్యాచులను టీమిండియా ఆడగా.. అందులో పది మ్యాచుల్లో విజయం సాధించింది. మిగిలిన మూడు మ్యాచులు డ్రాగా కాగా.. మరో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది.
స్వదేశంలో జరిగిన సిరీస్‌లో న్యూజిలాండ్ ను 1-0, శ్రీలంకను 2-0, బంగ్లాదేశ్ ను 2-0, ఆస్ట్రేలియాను 2-1తో టీమిండియా ఓడించింది. భారత్ స్వదేశంలో ఆడిన ఎనిమిది టెస్టుల్లో ఐదింటిలో గెలిచింది,
Details
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్
WTCలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో టాప్ 15 లో టీమిండియా ఎవరూ లేకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ 932, ఛతేశ్వర్ పుజారా 928 పరుగులను సాధించారు. ఇందులో అత్యధిక స్ట్రైక్ రేట్ గల రెండో బ్యాటర్ గా పంత్ నిలిచాడు. 80.81 స్ట్రైట్ రేట్‌తో అతను 500 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ 81.91 స్ట్రైక్ రేట్‌తో పంత్ కంటే ముందుస్థానంలో నిలిచాడు. WTC చరిత్రలో శ్రీలంకపై పంత్ అత్యంత వేగంగా 28 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
రవిచంద్రన్ అశ్విన్ 19.67 సగటుతో 61 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. రవీంద్ర జడేజా 47 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.