Afghanisthan Team : అఫ్గాన్ పసికూన కాదు.. లైట్ తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం
మరో రెండ్రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది. ఈ మెగా టోర్నీ ఆప్ఘనిస్తాన్ జట్టును పసికూన అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఎందుకంటే ఈ జట్టు తనదైన రోజున ఎలాంటి జట్లనైనా ఓడిస్తుంది. గతంలో ఇది చాలా సార్లు నిరూపితమైంది. ప్రస్తుతం ఆ జట్టులో 6 నుండి ఏడుగురు వరకు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఏ జట్టుకైనా చుక్కులు చూపించగలరు. ప్రపంచ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 7న ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో ఆప్ఘనిస్తాన్ తలపడనుంది. ప్రస్తుతం ఆ జట్టు బలాలు, బలహీనతల గురించి తెలుసుకుందాం.
నలుగురు అత్యుత్తమ స్పిన్నర్లతో పటిష్టంగా ఆప్ఘనిస్తాన్
హష్మతుల్లా షాహిదీ ఆప్ఘన్ జట్టుకు సారిథిగా వ్యవహరిస్తున్నాడు. ఇక టాప్ ఆర్డర్‌లో రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ వంటి నమ్మకమైన బ్యాటర్లు ఉన్నారు. మిడిలార్డర్‌లో నజీబుల్లా జద్రాన్ వేగంగా పరుగులు చేయడంలో దిట్ట. ఆల్ రౌండర్ లో మహ్మద్ నబీ ఆ జట్టుకు అదనపు బలం. నలుగురు అత్యుత్తమ స్పిన్నర్లు ఆప్ఘనిస్తాన్ కలిగి ఉంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాచ్ విన్నర్ లలో ఒకరిగా రషీద్ ఖాన్‌కు మంచి రికార్డు ఉంది. అతనితోపాటు ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, నూర్ ఆహ్మద్ ఉన్నారు. స్లో బంతుల్లో బ్యాటర్లను నవీన్ ఉల్ హక్ బోల్తా కొట్టించగలడు.
ఆప్ఘనిస్తాన్ జట్టులో సభ్యులు వీరే
చైన్నై వేదికగా అక్టోబర్ 23న పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది. ఆప్ఘన్ స్పిన్ విభాగంలో పటిష్టంగా ఉండటంతో పాకిస్థాన్ జట్టును ఓడించే అవకాశం ఉంది. ప్రపంచ కప్‌లో అప్ఘన్ జట్టును ఓడించిన పాకిస్థాన్ జట్టుకు అంత తేలిక కాదు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్ హమాన్, నవీన్ ఉల్ హక్
వరల్డ్ కప్ లో ఆప్ఘనిస్తాన్ మ్యాచుల షెడ్యూల్
vs బంగ్లాదేశ్ (7 అక్టోబర్), ధర్మశాల vs భారతదేశం (11 అక్టోబర్), ఢిల్లీ vs ఇంగ్లాండ్ (15 అక్టోబర్), ఢిల్లీ vs న్యూజిలాండ్ (18 అక్టోబర్), చెన్నై vs పాకిస్థాన్ (అక్టోబర్ 23), చెన్నై vs శ్రీలంక (30 అక్టోబర్), పూణే vs నెదర్లాండ్స్ (3 నవంబర్), లక్నో vs ఆస్ట్రేలియా (నవంబర్ 7), ముంబై (వాంఖడే) vs దక్షిణాఫ్రికా (నవంబర్ 10), అహ్మదాబాద్