Page Loader
Tamim Iqbal Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్ ఇక్బాల్
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్ ఇక్బాల్

Tamim Iqbal Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్ ఇక్బాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2025
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం ద్వారా అన్ని ఊహాగానాలకు తెరదించాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ద్వారా ఆయన తిరిగి జాతీయ జట్టులో చేరతారని వార్తలు వినిపించాయి. అయితే ఆయన తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ఫేస్‌బుక్‌లో తన సందేశంలో తమీమ్ తాను చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నానని, ఈ గ్యాప్‌ను ఇక పూర్తిచేయడం సాధ్యం కాదన్నారు. తన భవిష్యత్తు గురించి చాలా ఆలోచించుకున్నానని, ఇవాళ తన అంతర్జాతీయ క్రికెట్ అధ్యాయం ముగిసిందన్నారు.

Details

బంగ్లాదేశ్ తరఫున 243 వన్డేలు ఆడిన తమీమ్ ఇక్బాల్

2023 ప్రపంచ కప్‌కు ముందు జట్టు నుంచి తప్పించబడటంపై తాను షాక్‌కు గురయ్యానని, అభిమానులు తనకు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలని తమీమ్ చెప్పారు. జాతీయ జట్టులో తిరిగి చేరాలని ప్రతి ఒక్కరు ఆశించినా, తనకు ఇది సరైన సమయం అని భావించానని తెలిపారు. తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ తరఫున 243 వన్డేల్లో 8357 పరుగులు చేశారు. ఇందులో 14 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో 70 మ్యాచ్‌ల్లో 5134 పరుగులు చేసిన ఆయన 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు సాధించారు. అలాగే 78 టీ20ల్లో 1758 పరుగులు నమోదు చేశారు. తమీమ్ ఇక్బాల్ ప్రకటనతో బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక యుగానికి తెరపడింది.