
తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు రోహిత్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మను సన్మానించిన టీటీడీ అధికారులు, వెంకటేశ్వర స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ అనంతరం స్వదేశానికి తిరిగొచ్చిన రోహిత్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌తో హిట్‌మ్యాన్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
మరోవైపు రానున్న 2 రోజుల్లో ఆసియాకప్ టీమిండియాను బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీవారి సన్నిధిలో రోహిత్ శర్మ
Rohit Sharma visited Tirumala Temple at Tirupathi ahead of the World Cup 2023.
— Sravani. (@pullshotx45) August 13, 2023
May Lord Balaji be with him throughout the tournament. 🥹🙏🏻🧡pic.twitter.com/4W1gIn7c4G
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కుటుంబంతో రోహిత్ ఫొటోలు
Rohit Sharma with his family visited Tirumala Temple in Tirupathi ahead of the Asia Cup 2023.
— CricTracker (@Cricketracker) August 13, 2023
📸: tirupatiyaayo pic.twitter.com/i2dXIwcbTy